Anjaneya Dandakam in Telugu – ఆంజనేయ దండకం

Anjaneya Dandakam or Hanuman Dandakam is a poetic recitation in the praise of Lord Hanuman. It is one of the common prayers in every household. Anjaneya Dandakam is commonly recited in situations of fear with a strong belief that Lord Hanuman will dispel all fears and protect. Get Anjaneya Dandakam in Telugu lyrics pdf here and recite it with devotion for the grace of Lord Hanuman

We drafted the Hanuman Dandakam into paragraphs as below, taking the recitation of Anjaneya Dandakam by Sri Bala Murali Krishna as reference.

Anjaneya Dandakam in Telugu – ఆంజనేయ దండకం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రము, న్నీనామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి, నీ మీద నే దండకం బొక్కటింజేయ నూహించి, నీ మూర్తినిన్ గాంచి, నీ సుందరం బెంచి, నీ దాస దాసుండనై, రామ భక్తుండనై, నిన్ను నే గొల్చెదన్, నన్ కటాక్షంబునన్ జూచితే, వేడుకల్ చేసితే, నా మొరాలించితే, నన్ను రక్షించితే, అంజనాదేవిగర్భాన్వయా! దేవ!

నిన్నెంచ నేనెంత వాడన్దయాశాలివై చూచితే, దాతవై బ్రోచితే, దగ్గరన్ నిలిచితే, తొల్లి సుగ్రీవునకున్ మంత్రివై, స్వామి కర్యంబు నందుండి, శ్రీరామసౌమిత్రులం జూచి, వారిన్ విచారించి, సర్వేశు పూజించి, యబ్బానుజున్ బంటుగావించి, యవ్వాలినిన్ జంపి, కాకుస్థతిలకున్ దయా దృష్ఠి వీక్షించి, కిష్కిందకేతెంచి, శ్రీరామ కర్యార్థివై, లంకకే తెంచియున్, లంకిణింజంపియున్, లంకనున్ గాల్చియున్, భూమిజన్ జూచి, యానందముప్పొంగ, యాయుంగరంబిచ్చి, యారత్నమున్ దెచ్చి, శ్రీరాముకున్నిచ్చి, సంతోషనున్ జేసి, సుగ్రీవునుం అంగదున్ జాంబవంతాది నీలాదులున్ గూడి, యాసేతువున్ దాటి, వానరుల్ మూకలై, దైత్యులన్ ద్రుంచగా, రావణుడంత కాలాగ్ని ఉగ్రుండుడై, కోరి, బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వేసి, యా లక్ష్మణున్ మూర్ఛనొందింపగ నప్పుడేపోయి సంజీవనిన్ దెచ్చి, సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా, కుంభకర్ణాది వీరాదితో పోరాడి, చెండాడి, శ్రీరామబాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా, నంత లోకంబులానందమైయుండ నవ్వేళనన్, నవ్విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి, పట్టాభిషేకంబు చేయించి, సీతామహాదేవినిన్ దెచ్చి, శ్రీరాము తో జేర్చి , అయోద్యకున్ వచ్చి, పట్టాభిషేకంబు సం రంభమైయున్న నీకన్ననాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్, శ్రీ రామభక్తి ప్రశస్థంబుగా నిన్ను నీనామసంకీర్తనల్ చేసితే పాపముల్ బాయునే భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే సకలసామ్రాజ్యముల్ సకలసంపత్తులున్ గల్గునే వానరాకార! యోభక్తమందార! యోపుణ్యసంచార! యోధీర! యోశూర! నీవే సమస్తంబు నీవే మహాఫలంబుగా వెలసి యాతారకబ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి, శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమై యెప్పుడున్ తప్పకన్ తలచు నాజిహ్వయందుండి నీదీర్ఘదేహంబు త్రైలోక్యసంచారివై, శ్రీరామ నామాంకితధ్యానివై బ్రహ్మవై, బ్రహ్మ తేజంబంటచున్ రౌద్ర నీ జ్వాల కల్లోల హావీర హనుమంత!

ఓంకార హ్రీంకార శబ్దంబులన్ భూతప్రేతపిశాచంబులన్, గాలి దయ్యంబులన్, నీదు వాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టి నీముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి, కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మప్రభా భాసితంబైన నీదివ్యతేజంబునన్ జూచి, రారా నాముద్దు నరసింహాయంచున్,దయాదృష్ఠివీక్షించి, నన్నేలు నాస్వామీ!

నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే!

వాయుపుత్రా నమస్తే!

నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః

స్పందించండి